నూనె శ్రీధర్ అరెస్ట్ - ఏసీబీ
NEWS Jun 12,2025 08:42 am
తెలంగాణ నీటి పారుదల శాఖలో ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్ ను అరెస్ట్ చేసింది ఏసీబీ. తనకు సంబంధించి 13 ప్రాంతాలలో సోదాలు చేపట్టింది. వీటి బహిరంగ మార్కెట్ విలువ రూ. 150 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. తెల్లాపూర్ లో విల్లా, షేక్ పేట ప్లాట్, కరీంనగర్ లో మూడు ఓపెన్ ప్లాట్లు, అమీర్ పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో మూడు ఇండిపెండెంట్ హౌస్ లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించినట్లు తెలిపింది ఏసీబీ.