పిఎస్ఆర్ ఆంజనేయులకు బిగ్ రిలీఫ్
NEWS Jun 12,2025 08:32 am
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు బిగ్ రిలీఫ్ దక్కింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అనారోగ్య కారణాల దృష్ట్యా 14 రోజులకు బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. హై బీపీ, హృద్రోగ సమస్యతో బాధపడుతన్నారు పిఎస్ఆర్. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు కుటుంబీకులు. ఏపీపీఎస్సీ పరీక్ష మూల్యాంకన అవకతవకల కేసులో అరెస్ట్ అయ్యారు .