మోసం చంద్రబాబు నైజం - షర్మిల
NEWS Jun 12,2025 08:28 am
కూటమి ఏడాది పాలనపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ఏడాది గడిచినా హామీలు అమలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఎందుకు చేశారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. త్రీడీ గ్రాఫిక్స్ పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.