కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
NEWS Jun 12,2025 08:18 am
తెలంగాణ కేబినెట్ లో కొత్తగా చోటు దక్కించుకున్న ముగ్గురు మంత్రులకు హైకమాండ్ శాఖలను కేటాయించింది. ఈ మేరకు సీఎం ఆదేశాల మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. గడ్డం వివేక్ కు కార్మిక, న్యాయ, క్రీడా శాఖలు కేటాయించగా. వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, కమర్షియల్ టాక్స్ శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేటాయించారు.