యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు
NEWS Jun 12,2025 08:16 am
యూపీఐ లావాదేవీలపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. యూపీఐ చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు విధిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర సర్కార్ స్పందించింది. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించ లేదని స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. వాస్తవాలు తెలుసుకోకుండా దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు మంత్రి నిర్మలా సీతారామన్.