హైదరాబాద్‌లో భారీ వర్షం
NEWS Jun 12,2025 08:10 am
ఉపరితల ద్రోణి కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. మియాపూర్, హైదర్‌నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు నానా తిప్పలు పడ్డారు.