స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తెలంగాణ
NEWS Jun 12,2025 08:05 am
స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తెలంగాణ మారుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుబడులు పెట్టేందుకు యూకే దిగ్గజ సంస్థ ఆసక్తి చూపిందన్నారు. సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్ లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. యూకేకు చెందిన సెమీ కండక్టర్ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ ప్రతినిధులు భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.