అమ్మ మాట అంగన్వాడి బాట
NEWS Jun 11,2025 06:29 pm
మెట్‌పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడి సెంటర్ కాశిబాగు, ఇందిరా నగర్, ముస్లింపుర సెంటర్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ మనేమ్మ ఆదేశానుసారం అంగన్వాడి సెంటర్లలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలను అంగన్వాడి సెంటర్ లకు తీసుకురావాలని తల్లులకు అంగన్వాడి సూపర్వైజర్ ప్రతిభ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ అలంకరణ, పిల్లలకు ఎగ్గు బిర్యానీ అంగన్వాడి సెంటర్లో ఏర్పాటు చేశారు. అంగన్వాడి సూపర్వైజర్ ప్రతిభ, అంగన్వాడి టీచర్లు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.