లిక్కర్ కేసులో జగన్ జైలుకి వెళ్లడం ఖాయం
NEWS Jun 11,2025 05:03 pm
ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులతో 400 కేజీల బంగారం కొన్నారని ఆరోపించారు. అమరావతిని దెబ్బ తీయడానికి జగన్, భారతి కుట్ర పన్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఐదేళ్లపాటు జగన్‌రెడ్డి విధ్వంస పాలన చేశారని, మహిళలను అవమానించేలా మాట్లాడటం దుర్మార్గం అన్నారు.