చంద్రబాబు మోసం రైతులకు శాపం
NEWS Jun 11,2025 03:29 pm
మాజీ సీఎం జగన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సర్కార్ పై భగ్గుమన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించు కోవడం లేదన్నారు. ఈ సీజన్ లోనే ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. పరుచూరులో ఒక రైతు, గడిచిన శుక్రవారం కొండేపిలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అయినా సర్కార్ కు సోయి లేకుండా పోయిందన్నారు.