కేసీఆర్ కు ఉన్నంత అవగాహన ఏ నేతకు లేదు
NEWS Jun 11,2025 02:50 pm
వాగులు, వంకలు, నదులు, చెరువులపై కేసీఆర్ కు ఉన్నంత అవగాహన దేశంలో ఏ నాయకుడికి లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇరిగేషన్ గురించి కేసీఆర్ ని పిలిచి అడగడం అంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్లేనని అన్నారు. ధర్మం, న్యాయమే చివరికి గెలుస్తుందన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.