ఘనంగా ప్రసన్న వేంకటేశ్వర కల్యాణం
NEWS Jun 11,2025 02:43 pm
తిరుపతిలోని అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుని కల్యాణం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా విష్వక్సేన ఆరాధన, పుణ్య హవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్ట, సంకల్పం, మాంగల్య ధారణ, మంగళ హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవైఈవో హరిద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, భక్తులు పాల్గొన్నారు.