మోహినీ అవతారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
NEWS Jun 11,2025 02:05 pm
తిరుపతి లోని ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రంగా కొలుస్తున్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు పల్లకీలో మోహినీ అవతారోత్సవంలో భక్తులను అనుగ్రహించారు. వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.