కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ లోకి నో ఎంట్రీ
NEWS Jun 11,2025 01:38 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తానని చెప్పారు. తాను పవర్ లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లోకి రానివ్వనని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబీకులే తెలంగాణకు శత్రువులు అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కులగణన వివరాలు పంచు కోవడానికే ఢిల్లీ వచ్చానని స్పష్టం చేశారు సీఎం.