కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 55 నిమిషాల పాటు ఈ ఎంక్వయిరీ సాగింది. పలు ప్రశ్నలు సంధించారు కమిషన్ చైర్మన్. 200 పేజీలతో వివరాలు వెల్లడించారు. విచారణ అనంతరం కొద్ది సేపటి కిందట బీఆర్కే భవన్ నుండి ఆయన బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా తన ఫామ్ హౌస్ కు వెళ్లి పోయారు.