విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్
NEWS Jun 11,2025 12:45 pm
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట పలువురు నేతలు ఉన్నారు. కానీ వారిని ఎవరినీ అనుమతించ లేదు. కమిషన్ విచారణ సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు తండోప తండాలుగా తరలి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో ఇవాళ అటెండ్ అయ్యారు.