గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు
NEWS Jun 11,2025 12:14 pm
ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కేసులో జైలు పాలైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. బుధవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్ల రాదని ఆదేశించింది. రూ. 10 లక్షల పూచీకత్తు చెల్లించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గత మే 6న సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గాలికి జైలు శిక్ష విధించింది. అయితే ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడంపై సీబీఐ మండిపడింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.