దర్శకుడు ఏఎస్ రవికుమార్ కన్నుమూత
NEWS Jun 11,2025 10:54 am
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ కన్నుమూశారు. గోపీచంద్ హీరోగా వచ్చిన 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. బాలకృష్ణతో 'వీరభద్ర', సాయి ధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రాలు తీశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.