ఏఈ నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
NEWS Jun 11,2025 08:41 am
చొప్పదండి లోని ఎస్సారెస్సీ క్యాంపు కార్యాలయంలో ఏఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. 12 చోట్ల దాడులు జరిపింది. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు. శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరవుతున్న సమయంలో ఈ దాడులు జరగడం కలకలం రేపుతోంది.