శ్రీశైలం జలాశయానికి వరదనీరు
NEWS Jun 11,2025 08:25 am
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు కళ కళ లాడుతోంది. ఇన్ ఫ్లో 15,562 క్యూసెక్కులు ఉండగా పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 835.80 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55.0840 టీఎంసీలు ఉన్నాయి. ఇంకా కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ప్రారంభం కాలేదు విద్యుత్ ఉత్పత్తి.