బాలికల భవిష్యత్తుకు పునాదులు ఏర్పర్చుకుందాం
NEWS Jun 11,2025 12:49 pm
సమాజంలో బాలికలు ఉన్నత స్థాయిలో ఎదిగేలా పునాదులు ఏర్పర్చు కోవాలని అన్నారు ఇన్చార్జి తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీఓ ప్రేమ్ సాగర్. ఐసీడీఎస్ సీడీపీవో నీలిమ ఆధ్వర్యాన కిషోరి వికాసం ముగింపు కార్యక్రమం జరిగింది. ఐసీడీఎస్ కార్యాలయంలో సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిలో మానవహారాన్ని చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనతోపాటు బెలూన్లను ఎగుర వేశారు. బాలికల పట్ల అసమానతలు వదిలి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ బాలికలు, తదితరులు పాల్గొన్నారు.