ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మహిళల మీద సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలను పిశాచులతో పోల్చుతారా? రాక్షసులు అంటారా? సంకర జాతి అని అవమానిస్తారా ?చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడానికి మీకు ఎందుకు నామోషీ ? అంటూ నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి. YCP చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తోందన్నారు. మంగళ వారం ఆమె మీడియాతో మాట్లాడారు.