గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల అడ్మిషన్లు
- మంత్రికి విజ్ఞప్తి
NEWS Jun 10,2025 12:13 pm
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం ఆదేశాల మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమ జీఓ నెం. 205 ప్రకారం.. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయాలని వారు కోరారు. గల్ఫ్ బాధితుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.