తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆషాఢ బోనాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమీక్ష చేపట్టారు. రాష్ట్ర పండుగగా బోనాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బోనాల నిర్వహణకు ఇప్పటి వరకు రూ.20 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఆదేశించారు.