అమరావతి రాజధాని రైతు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జాతీయ మహిళా కమిషన్. తన కామెంట్స్ ను కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు కీలక ప్రకటన వెలువరించింది. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.