ఉత్తరాంధ్ర పర్యటనలో బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ ను చేపట్టారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పోటెత్తారు. తమ సమస్యలను విన్నవించారు మంత్రికి. ఓ వైపు జోరుగా వాన కురుస్తాన్నా లెక్క చేయకుండా దర్బార్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. చివరి వ్యక్తి వరకు కలిసి అందరితో ఫోటోలు దిగారు. ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి లోకేష్ చిత్తశుద్ధి పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.