ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలంటూ మరోసారి స్పష్టం చేసింది సీబీఐ. ఎలా క్లీన్ చిట్ ఇస్తారంటూ ప్రశ్నించింది హైకోర్టును. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆమెకు వ్యతిరేకంగా. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మరోసారి శ్రీలక్ష్మిని విచారణ చేపట్టాలని సూచించింది రాష్ట్ర హైకోర్టుకు. దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మైనింగ్ కేటాయింపుల వ్యవహారం కలకలం రేపింది. ఇదే కేసులో కీలకమైన వ్యక్తిగా ఉన్న ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష పడింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేసింది సుప్రీంకోర్టు.