తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్
NEWS Jun 10,2025 10:25 am
వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులు వీస్తాయని, దీని కారణంగా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించింది. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.