టీటీడీపై దుష్ప్రచారం ఈవో ఆగ్రహం
NEWS Jun 10,2025 09:25 am
సోషల్ మీడియా వేదికలలో ప్రచారం అవుతున్న ఒక వీడియోలో మద్యం సేవిస్తున్న వ్యక్తి దృశ్యాలను తిరుమలలో జరిగినట్లు పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్లుగా టీటీడీ దృష్టికి వచ్చిందని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. అలిపిరి ప్రారంభంలోని తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదన్నారు. అయినప్పటికీ కొందరు తిరుమలలో అపచారం జరిగిందంటూ ప్రచారం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు ఈవో.