తిరుపతి లోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉత్సవాలలో భాగంగా శ్రీవారు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో దర్శనం ఇచ్చారు భక్తులకు. అనంతరం సింహ వాహనంపై ఊరేగారు. స్వామి వారి కృప కోసం భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు.