అశ్వ వాహనంపై గోవింద రాజ స్వామి
NEWS Jun 10,2025 08:50 am
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై స్వామి వారు విహరించారు. పోటెత్తిన భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.