టిటిడి పాఠశాలల్లో సద్గమయ - ఈవో
NEWS Jun 10,2025 08:44 am
టిటిడి పాఠశాలల్లో ఈ నెల 16 నుండి 19 తేదీ వరకు సద్గమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టిటిడి ఈవో జె. శ్యామల రావు తెలిపారు. టిటిడికి చెందిన 7 పాఠశాలలలో టిటిడి విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా, సరళమైన పదజాలంతో బోధించాలని సూచించారు. శ్రీవారి వైభవాన్ని యువత, పిల్లలకు మరింతగా తెలిసేలా శిక్షణ ఉండాలన్నారు.