క్రికెట్ కు గుడ్ బై చెప్పిన నికోలస్ పూరన్
NEWS Jun 10,2025 07:41 am
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించాడు. విండీస్ తరపున 61 వన్డేలు, 106 టి20 మ్యాచ్ లు ఆడాడు. ఈసారి జరిగిన టాటా ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాడు. పరుగుల వరద పారించాడు. నికోలస్ పూరన్ 29 ఏళ్ల వయసులోనే గుడ్ బై చెప్పడం క్రికెట్ అభిమానులను విస్తు పోయేలా చేసింది.