హార్డ్ డిస్క్ ల ధ్వంసంతో నాకేం సంబంధం
NEWS Jun 09,2025 04:55 pm
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సోమవారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. నేను 2023 డిసెంబర్ 4, సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేశానని, అదే రోజు రాత్రి 8 గంటలకు హార్డ్ డిస్క్‌లు ధ్వంసం అయితే తనకేంటి సంబంధం అని ప్రశ్నించారు. రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు కేసులో ఇన్వాల్స్ చేయలేదన్నారు.