జర్నలిస్టు ముసుగులో కారుకూతలు కూస్తే ఎలా..?
NEWS Jun 09,2025 04:17 pm
పోలీసులు అరెస్టు చేసింది జర్నలిస్ట్ కొమ్మినేనిని కాదని, వేశ్యల రాజధాని అమరావతి అంటూ రాజధాని రైతు మహిళలపై కారుకూతలు కూసిన కొమ్మినేని శ్రీనివాసరావును అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన కొమ్మినేని అరెస్టుపై మీడియాతో మాట్లాడారు. వైకాపా పూర్వపు సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైకాపా మీడియా యాభై ఏళ్ళ పాత్రికేయ అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేస్తారా? అంటూ ప్రభుత్వంపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.