పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం
NEWS Jun 09,2025 01:45 pm
పేదల పక్షాన తమ సర్కార్ పని చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లి గ్రామంలో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతున్నామని తెలిపారు.