టీపీసీసీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం
NEWS Jun 09,2025 01:42 pm
ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ కొత్త ఆలోచన చేపట్టింది. ప్రతిరోజూ గాంధీభవన్‌లో ఇద్దరు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండనున్నారు. ఈనెల 10 నుంచి దీనిని అమలు చేయనున్నారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 'మంత్రులతో ఫేస్ టు ఫేస్' కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా అమలవుతోంది.