విశాఖలో మహిళా వరల్డ్ కప్ మ్యాచ్
NEWS Jun 09,2025 09:30 am
క్రికెట్ అభిమానులకు తీపి కబురు చెప్పింది బీసీసీఐ. త్వరలో విశాఖలో క్రికెట్ ఫీవర్ కొనసాగనుంది. క్రికెట్ పండుగ మొదలు కానుందని ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్, అక్టోబర్లలో విశాఖ వేదికగా మహిళ వరల్డ్ కప్ మ్యాచ్ లకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. డిసెంబర్లో సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ కు ఓకే చెప్పిందన్నారు.