ముగిసిన మాజీ మంత్రి కాకాణి విచారణ
NEWS Jun 09,2025 09:26 am
అక్రమ మైనింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విచారణ ముగిసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం మూడు రోజుల పాటు విచారణ కొనసాగింది. సుదీర్ఘంగా సుమారు 24 గంటల పాటు ప్రశ్నించారు. కాకాణి వద్ద నుండి ఎటువంటి సమాచారం వచ్చిందనేది అత్యంత గోప్యంగా భద్రపరిచారు పోలీసులు. కాకాణి ఇచ్చిన సమాచారం మేరకు తదుపరి కార్యాచరణకు సిద్దమయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం ఉంది.