ఎలక్ట్రిషియన్ల వృత్తి ప్రమాదకరమైనది
NEWS Jun 09,2025 09:09 am
సమాజంలో పని చేస్తున్న ఎలక్ట్రిషియన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. సేఫ్టీ అన్నది గాలిలో దీపంగా మారిందన్నారు. గతంలో విద్యుత్ఘాతంతో సురేష్ మృతి చెందిన ఘటన తనను కలిచి వేసిందన్నారు. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో పని చేస్తున్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లకు రక్షణ, భద్రత ఉండేందుకు గాను సేఫ్టీ కిట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా వీరి భద్రత కోసం తమ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.