TFCC అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా
NEWS Jun 08,2025 10:11 pm
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటలలోపే తను రాజీనామా చేయడం గమనార్హం. తనకు తెలియకుండానే కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇక తాను అధ్యక్ష పదవికి ఉన్నా లేనట్టేనని పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.