దేశ వ్యాప్తంగా కలకలం రేపింది జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం. తన ఢిల్లీ నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తనపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తనకు కేంద్ర సర్కార్ మద్దతు ఇస్తోందన్న ప్రచారం జరగడం కలకలం రేపింది. ఈ సమయంలో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని టాక్. తనను తొలగించాలంటే పార్లమెంట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది.