నేటి నుంచి ఐపీఎల్ ప్లేఆఫ్స్
NEWS May 29,2025 06:36 am
ఐపీఎల్ 2025 కీలక దశకు చేరుకుంది. ఇప్పటి వరకు లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఆరు జట్లు ఇంటి బాట పట్టాయి. ప్లే ఆఫ్స్ కు నాలుగు జట్లు చేరుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఎలెవన్, ముంబై ఇండియన్స్ , గుజరాత్ టైటాన్స్ మధ్య కప్ కోసం పోటీ కొనసాగనుంది. ఇవాళ కీలకమైన క్వాలిఫయర్ -1 లో తలపడనున్నాయి ఆర్సీబీ, పంజాబ్ జట్లు. ఇందులో గెలుపొందిన టీం నేరుగా ఫైనల్ కు వెళుతుంది. ఇరు టీమ్ లు ఇప్పటి దాకా కప్ గెలవక పోవడం విశేషం.