కడప జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది టీడీపీ మహానాడు. ఇవాళ చివరి రోజు. భారీ ఎత్తున జనం తరలించే పనిలో నిమగ్నమయ్యారు టీడీపీ శ్రేణులు. ఇందులో భాగంగా రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు మంత్రి పొంగూరు నారాయణ. దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు స్వచ్చందంగా హాజరవుతారని తెలిపారు. ఈ కీలక సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారని చెప్పారు. ఇప్పటికే పలు తీర్మానాలు చేయడం జరిగిందన్నారు.