టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి కీలక సమావేశం జరగనుంది. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి డెవలప్మెంట్ పై పలు నిర్ణయాలు తీసుకోనుంది బోర్డు. తిరుమలలోని పలు క్యాంటీన్ లకు టెండర్లు పిలిచేందుకు నిర్ణయం తీసుకుంటారు. భక్తులకు నాణ్యమైన ఆహారం విక్రయించగల, గుర్తింపు ఉన్న ప్రముఖ సంస్థలకు టెండర్ లో పాల్గొనే అవకాశం ఇస్తారు. పలు మఠాల ఆక్రమణలపై సర్వే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకునే విషయంపై చర్చిస్తారు.