పాకిస్తాన్ తో లింక్స్ 8 మంది అరెస్ట్
NEWS May 19,2025 09:01 pm
ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. హరియాణాలో నలుగురు, పంజాబ్ లో ముగ్గురు, UPలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా విచారణ చేపట్టారు. కాగా అరెస్టయిన వారిలో యూట్యూబర్ జ్యోతి, విద్యార్థి దేవేందర్ సింగ్, సెక్యూరిటీ గార్డ్ నౌమన్ ఇలాహీ, వ్యాపారి షహజాద్, ముర్తాజా అలీ, అర్మాన్, గజాలా, యామిన్ ఉన్నారు. వీరంతా పాక్ ISISI కి సాయం చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.