శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌ఓ) అయ్యన్నపై దేవస్థానం కార్య నిర్వహణాధికారి (ఈవో) ఎస్. శ్రీనివాసరావు సస్పెన్షన్ వేటు వేశారు. సీఎస్‌ఓగా ఉద్యోగ బాధ్యతల పట్ల అయ్యన్న నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 10 రోజుల కిందట ఆలయ సందర్శన కోసం ఇతర మతస్తులు వచ్చారని విచారణలో తేలింది. వారి వద్ద అన్యమత పుస్తకాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. క్యూ లైన్ లో తనిఖీ చేస్తుండగా ఇది బయట పడింది. దీంతో చర్యలు తీసుకున్నారు ఈవో.