మహిళలు, బాలికల భద్రతపై ఫోకస్
NEWS May 19,2025 02:36 pm
ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు, బాలికల భద్రతపై ఎక్కువగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే శక్తి మొబైల్ యాప్ రికార్డ్ సృష్టించిందని చెప్పారు డీజీపీ. ఏకంగా 1,52,16,440కి పైగా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. ఇపుడు హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా శక్తి యాప్ ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని స్పష్టం చేశారు . రాష్ట్ర వ్యాప్తంగా 164 శక్తి టీమ్స్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.