బీసీసీఐ అత్యవసరంగా సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి ప్రెసిడెంట్ బిన్నీతో పాటు కార్యదర్శి జే షా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం ఐపీఎల్ 18 మెగా టోర్నీ కొనసాగుతోంది. అయితే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేశంలోని 27కి పైగా ఎయిర్ పోర్ట్ లను మూసి వేసింది. ఈ తరుణంలో ఐపీఎల్ ను రద్దు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఇంకా కొన్ని మ్యాచ్ లు నిర్వహించాల్సి ఉంది. యుద్దం తప్పదని కేంద్రం ప్రకటించడంతో ఐపీఎల్ నిర్వహంచాలా లేదా అనే దానిపై కీలక భేటీ జరిగింది.