పన్ను వసూళ్లలో విశాఖ కార్పొరేషన్ రికార్డ్
NEWS Apr 12,2025 07:52 am
విశాఖపట్నం కార్పొరేషన్ రికార్డ్ సృష్టించింది. ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. నిర్దేశించిన లక్ష్యానికి మించి వసూలు చేసి విస్తు పోయేలా చేసింది. ప్రజల నుంచి ఏకంగా రూ. 510 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి వంగలపూడి అనిత విశాఖ కార్పొరేషన్ మేయర్, కమిషనర్ ను అభినందించారు. మిగతా కార్పొరేషన్లు విశాఖ కార్పొరేషన్ ను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.